Type Here to Get Search Results !

Jagananna Chedodu Scheme Full Details in Telugu - CHEDODU Eligibility Application Procedure

Jagananna Chedodu Scheme Full Details in Telugu - CHEDODU Eligibility Application Procedure
Backward Classes .Welfare – Sanction of Financial Assistance @ Rs.10,000/- per annum to the Washermen, Nayee Brahmins and Tailors – Naming of the scheme as “Jagananna Chedodu” scheme – Orders-Issued BACKWARD CLASSES WELFARE (C ) DEPARTMENT G.O.Ms.No. 5 Dated: 31.01.2020
Government have issued orders for implementation of Financial Assistance to the Washermen, Nayee Brahmins and Tailors who are having Permanent/Mobile shops, vide G.O.Ms.No.59,Backward Classes Welfare(C) Department, dated: 25-7-2019. The Financial Assistance is @ Rs.10,000/- per each eligible beneficiary per year for a period of 5 years i.e., from 2019-2020 to 2023 -2024

Jagananna Chedodu Scheme Full Details in Telugu - CHEDODU Eligibility Application Procedure


Jagananna Chedodu Scheme Brief objective
It is a state governement funded welfare scheme only for tailors, washermen and Barbers of the state, who had lost their livelihood due to COVID-19 pandemic. The fund provided to each beneficiary will be transferred directly to their bank accounts. The beneficiaries will be identified and shortlisted through surveys.
 
Jagananna Chedodu Scheme Benefits to the citizens
Under this scheme, beneficiaries will be provided a one time amount of Rs.10,000. This fund can be utilised by the beneficiaries for purchasing tools, equipment and other essentials to grow their source of income and work establishment. This will help them to fulfil their investment needs.

Jagananna Chedodu Scheme Eligibility
Age of less than 60 years
Rajakas/Dhobis (Washermen) of the state
Nayee Brahmin (Barbers) having their own establishment
Tailors belonging to the Backward Class (BC), Extremely Backward Classes (EBC) category and Kapu Community

నాయీ బ్రాహ్మణులు, చాకలి కార్మికులు మరియు టైలర్లు రూ. ఆర్థిక సహాయం పొందుతారు. సంవత్సరానికి 10000/- నేరుగా వారి బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేయబడుతుంది. డబ్బు బదిలీ గురించి తెలుసుకోవడానికి దరఖాస్తుదారులు తమ ఖాతాలను తనిఖీ చేయవచ్చు. జగనన్న చేదోడు పథకం 2020-21 సంవత్సరానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. గత సంవత్సరం వరకు జగనన్న చేదోడు పథకం లో భాగంగా రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఆయా కమ్యూనిటి వారు మాత్రమే అర్హులుగా ఉండేవారు. కానీ గౌరవ ఆంధ్ర ప్రదేశ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి అనంతరాము వారి ఆమోదం మేరకు విడుదల అయిన మెమో నెంబర్ 2030/BCW/C/2021 తేదీ 24.9.2021 ప్రకారం ఇక అన్ని కమ్యూనిటీ ( కులాల ) వారికి జగనన్న చేదోడు పథకం వర్తిస్తుంది.

పథకం పేరు : జగనన్న చేదోడు

లబ్ది : సంవత్సరానికి ₹ 10,000 రూపాయలు

పథకం ప్రయోజనాలు
ఈ పథకం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి, ఒకటి చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తులకు మరియు ఆదాయం చాలా తక్కువగా ఉన్న వ్యక్తులకు కూడా నిధుల లభ్యత. టైలర్లు, లాండ్రీమ్యాన్ మరియు మంగలి వారికి ఈ పథకం కింద చేర్చబడిన మూడు కేటగిరీలకు ప్రోత్సాహకాలు అందించబడతాయి. లబ్ధిదారులు రోజువారీ విధానాలను కొనసాగించడానికి లేదా వారి పిల్లలను పాఠశాలకు పంపడానికి ప్రోత్సాహకం ఉపయోగించబడుతుంది, ఎందుకంటే వారిలో చాలామంది పిల్లల విద్యకు ఖర్చును భరించలేరు.

అర్హత ప్రమాణం
క్రింద ఇవ్వబడిన అర్హత ప్రమాణాల ద్వారా దరఖాస్తుదారులు స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు:-

⦿ దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి.
⦿ దరఖాస్తుదారు తప్పనిసరిగా టైలర్, చాకలి లేదా నాయి బ్రాహ్మణుడు అయి ఉండాలి.
⦿ దరఖాస్తుదారు తప్పనిసరిగా వారి వృత్తి యొక్క సామాజిక అధికారులతో నమోదు చేసుకోవాలి.

అవసరమైన పత్రాలు
పథకం కోసం దరఖాస్తు చేయడానికి క్రింది పత్రాలు అవసరం:-
చేదోడు అప్లికేషన్ ఫారం
ఆధార్ కార్డు
గుర్తింపు ప్రయోజనాల కోసం ఓటరు గుర్తింపు కార్డు
డొమికల్ సర్టిఫికేట్
వృత్తి యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్.
బ్యాంక్ ఖాతా వివరాలు
ఆదాయ ధృవీకరణ పత్రం
షాపు తో దరఖాస్తుదారు దిగిన ఫోటో

జగనన్న చేదోడు పథకం తరచుగా అడిగే ప్రశ్నలు సమాధానాలు

జగనన్న చేదోడు పథకం ఎవరికి వర్తిస్తుంది?
సొంత దుకాణం కలిగి ఉండి అదే జీవనోపాధిగా జీవిస్తున్న టువంటి రజకులు, నాయి బ్రాహ్మణులు మరియు టైలర్ లకు ఈ పథకం వర్తిస్తుంది...

జగనన్న చేదోడు కు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి?
తప్పనిసరిగా కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డ్, సరైన బ్యాంక్ అకౌంట్ మరియు ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండాలి.

సామాజిక పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారులు జగనన్న చేదోడు కు అర్హుల?
జగనన్న చేదోడు పథకానికి సామాజిక పెన్షన్ తో సంబంధం లేదు. వారు పథకానికి అర్హులవుతారు.

జగనన్న చేదోడు అనర్హత లు ఏమిటి?
కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన వారు, ఇన్కమ్ టాక్స్ చెల్లించేవారు ఉండరాదు. కుటుంబంలో ఎవరి పేరు మీద ఫోర్ వీలర్ ఉండరాదు (అయితే ట్రాక్టర్ ఆటో టాక్సీ వాళ్లకు మినహాయింపు ఉంది).. ఎలక్ట్రిసిటీ బిల్ 300 యూనిట్లు దాటరాదు.. మున్సిపాలిటీ ఏరియా లో వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ నివాసస్థలం ఉండరాదు..ఇక మాగాణి మూడు ఎకరాలు మించి, మెట్ట పది ఎకరాల మించి, రెండు కలిపి కూడా పది ఎకరాలు మించి ఉండరాదు

గత సంవత్సరం లబ్ధిదారులు మరొకసారి అప్లై చేయాలా?
అవసరం లేదు.

టైలర్ లకు జగనన్న చేదోడు లబ్ధి పొందాలంటే ఏ కులానికి చెందిన వారు అయి ఉండాలి?
టైలర్ లకు కులంతో సంబంధం లేదు. అయితే ప్రతి ఒక్కరూ కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.

రజకులకు తప్పనిసరిగా షాపు ఉండాలా?
రజకులకు అయితే షాప్ మాత్రమే కాకుండా, చిన్న బంకు లేదా బడ్డీ లేదా గ్రామీణ ప్రాంతంలో వారి నివాసం వద్ద అదే ప్రధాన వృత్తిగా కొనసాగిస్తూ జీవనోపాధి సాగించే వారిని కూడా అర్హులుగా పరిగణించాలని గత సంవత్సరం గైడ్లైన్స్  లో  ప్రభుత్వం పేర్కొంది..

వేరే కులం వారు రజక మరియు నాయి బ్రాహ్మణ వృత్తి లో ఉంటే ఈ పథకం వర్తిస్తుందా?
వర్తించదు.. రజక మరియు నాయి బ్రాహ్మణ వృత్తి లో ఉన్న వారు అదే కులానికి సంబంధించిన వారు గా ఉండవలెను.

చేదోడు పథకానికి ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికెట్ ఏమి ఇవ్వాలి? ప్రతి సంవత్సరం తీసుకోవాలా?
లేబర్ సర్టిఫికెట్ సరిపోతుంది. రెన్యువల్ లబ్ధిదారులకు గత ఏడాది సర్టిఫికెట్ సరిపోతుంది

వేరే పని చేసుకుంటూ నాయి బ్రాహ్మణ, రజక, టైలర్ వృత్తిని చేసేవారు అర్హుల?
అర్హులు కారు.. తప్పనిసరిగా అదే వృత్తినే ప్రధాన వృత్తికి కలిగి ఉండాలి.

రజక, నాయిబ్రాహ్మణ, టైలర్ కొత్త దరఖాస్తుకు కావలసినవి :
గత సంవత్సరం లబ్ధి పొందిన వారి వివరాలు కింద డాక్యుమెంట్లు ఇవ్వటం జరిగింది. వారికి 

వెరిఫికేషన్ చేయుటకు కావలసిన డాక్యుమెంట్లు
1. రైతు కార్డు జిరాక్స్
2. వారి పేరుమీద ఉన్న బ్యాంకు ఎకౌంటు పాస్ బుక్ జిరాక్స్
3. ఆధార్ కార్డు జిరాక్స్
4. ఆధార్ కార్డు కు బ్యాంకు ఎకౌంటు లింక్ అయ్యి ఉంటే వాటి వివరాలు. లింకు అయితే ఇవ్వండి అవ్వకపోతే ఇవ్వకండి.
5. లబ్ధిదారు షాపు తో దిగిన ఫోటో
6. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్

మంజూరు విధానం :
Step 1 : ప్రతీ జిల్లా BC సర్వీస్ కార్పొరేషన్ సొసైటీ ద్వారా CEO, APCFSS వారు అందరి MPDO/MC వారికి గత సంవత్సర లబ్ధిదారుల వివరాలను మరియు విధి విధానాలను పంపించడం జరుగుతుంది.

Step 2 : MPDO/MC వారు ఆ లిస్టు లను వారి పరిధిలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాలకు పంపించడం జరుగుతుంది. సచివాలయాల్లో గత సంవత్సరం తీసుకున్న ఇటువంటి వారిని రీ వెరిఫికేషన్ లో భాగంగా షాపు ఉన్నదా లేదా? ఆ వృత్తిలో ఇంకా ఉన్నారా లేదా? అనే విషయాలను పరిగణలోకి తీసుకుంటారు. ప్రభుత్వ విధి విధానాల మేరకు కొత్త అర్హుల జాబితాను కూడా సిద్ధం చేయడం జరుగుతుంది.

Step 3 : సచివాలయాల నుంచి రీ వెరిఫికేషన్ చేసినటువంటి గత సంవత్సరం లబ్ధి పొందిన వారి వివరాలు మరియు కొత్తగా అర్హులైన వారి వివరాలను సోషల్ ఆడిట్ టీం వారి రిమార్కులతో MPDO/MC వారికి పంపించడం జరుగుతుంది. వారు థర్డ్ పార్టీ సోషల్ ఆడిట్ టీం కు పంపడం జరుగుతుంది. వారు సోషల్ ఆడిట్ చేయటం జరుగుతుంది

Step 4 : థర్డ్ పార్టీ సోషల్ ఆడిట్ టీం ఇచ్చిన రిమార్కుల అనుగుణంగా అనర్హులను తీసివేసి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ లను MPDO/MC వారు ప్రిపేర్ చేయడం జరుగుతుంది .

Step 5 : MPDO/MC వారు సచివాలయం వైజ్ గా అర్హుల జాబితాను సిద్ధం చేసి సచివాలయాలకు అందించడం జరుగుతుంది. అక్కడ అభ్యంతరాల కోసం సోషల్ ఆడిట్ లో భాగంగా సచివాలయంలో హ్యాంగ్ చేయడం జరుగుతుంది .

Step 6 : అభ్యంతరాలు స్వీకరించిన తరువాత సచివాలయాల నుంచి MPDO/MC వారికి ఫార్వర్డ్ అవుతాయి. అక్కడ వారు క్రాస్ చెక్ చేసుకుని ఎలిజిబుల్ లిస్ట్ అనేది జిల్లా ED, DBCSCS వారికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది.

Step 7 :జిల్లా ED, DBCSCS వారు చివరగా తనిఖీ చేసి సంబంధిత జిల్లా కలెక్టర్ వారి నుంచి ఆమోదం తీసుకోవాలి .

Step 8 :VC&MD APBCCFC వారికి తెలియజేస్తూ కార్పొరేషన్ వైజ్ గా బిల్లులను ప్రిపేర్ చేయడం కోసం జిల్లా ED, DBCSCS వారు CEO, APCFSS వారికి తుది జాబితా పంపించాలి.

Step 9 : ప్రభుత్వం నిర్దేశించిన తేదీ నాడు అర్హుల ఖాతాలోకి డైరెక్టుగా అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది .

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.