Type Here to Get Search Results !

JAGANANNA THODU Scheme - Interest Free financial assistance of Rs.10,000 to Small Traders

Department of Grama Volunteers/ Ward volunteers & Village Secretariats / Ward Secretariats –JAGANANNA THODU – Interest Free (SUNNA VADDI) financial assistance of Rs.10,000/- and distribution of identity cards to “Chiru Vyaparulu” and artisans engaged in traditional handicrafts – certain Guidelines- Orders- Issued. G.O.Ms.No.01 Dated:29-05-2020 The AP government's 'Jagannanna Thodu' scheme seeks to help small traders who are struggling with high interest rates.

JAGANANNA THODU Scheme Details - Interest Free  financial assistance of Rs.10,000 to Small Business

Brief objective
The AP government's 'Jagannanna Thodu' scheme seeks to help small traders who are struggling with high interest rates.

Benefits to the citizens
Interest-free term loan of Rs 10,000 per year would be extended to the hawkers, street vendors, and artisans engaged in traditional handicrafts through banks.

Chiruvyaparulu engaged in vending on footpath, selling vegetables in pushcarts, selling tiffin and food items on the roadside and pavements, etc. require daily working capital in the range of Rs 2000/- to 5000/- and they end up taking loans at usurious interest rate ranging from Rs.3, 4 to Rs 10/-. Often people who are engaged in traditional handicrafts like lace work, kalamkari work, Etikoppaka toys, Kondapalli toys, leather puppets, potters, Bobbili Veena, Brass Craft articles, etc. are also forced to
take loans at such exorbitant rates and suffer financially.

In order to ameliorate the financial hardship of the chiruvyaparulu and the people engaged in the traditional handicrafts, the scheme JAGANANNA THODU is implemented to provide financial assistance up to Rs.10000/- at 0% (SUNNA VADDI) interest to such needy people, who can avail this facility whenever required by them.

“జగనన్న తోడు” — చిరువ్యాపారులు & సాంప్రదాయ వృత్తిదారులకు రూ.10,000/- వరకు ఆర్ధిక  సహాయం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్మోహన్ రెడ్డి, ప్రజా సంకల్ప యాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసినప్పుడు అనేకమంది వృత్తిదారులు, చిరు వ్యాపారులు, ఉద్యోగులు, కర్షకులు, కార్మికులను కలిసి వారు పడుతున్న ఇబ్బందులను చూసి బాధలను విని నవరత్నాల పథకాల ద్వారా అన్ని వర్గాల సంక్షేమ మరియు అభివృద్ధికి కృషిచేస్తున్నారు.

చిరువ్యాపారులు మరియు సాంప్రదాయ చేతివృత్తిదారులు ఇప్పటి వరకు స్థానికంగా ఉన్న వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేసి వారి వ్యాపారాలను నిర్వహిస్తూ ఆర్థికంగా ఆటుపోటులను ఎదుర్కొంటున్నారు.

నవరత్నాల అమలులో భాగంగా “జగనన్న తోడు” పధకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పది లక్షలమంది చిరువ్యాపారులకు మరియు సాంప్రదాయ చేతివృత్తిదారులు, వారి వ్యాపారాల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఒక్కొక్కరికి రూ.10,000/- లోపు పెట్టుబడి మూలధనంగా బ్యాంకుల నుండి వడ్డీ లేని ఋణం ఇప్పించుటకు శ్రీకారం చుట్టారు.

చిరువ్యాపారులు అంటే ఎవరు?
  • సాంప్రదాయబద్ధమైన చేతి వృత్తులను జీవనాధారంగా జీవించేవారు. ఉదా. మగ్గం పని, లెస్ వర్క్, కుమ్మరి, కలంకారి, ఏటుకొప్పాక బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, తోలుబొమ్మలు, బొబ్బిలి వీణ, ఇత్తడి వస్తువుల తయారీ మొదలైనవి ఉత్పత్తి చేస్తూ స్వయంగా అమ్ముకునేవారు.
  • రోడ్డు ప్రక్కన, వీధుల్లో, బహిరంగ ప్రదేశాలలో, ఫుట్ పాత్ లలో మరియు ప్రైవేటు స్థలాలలో చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ జీవనం చేసుకునేవారు.
  • సుమారు 5X5 అడుగుల స్థలంలో శాశ్వత లేదా తాత్కాలిక షాప్ లను ఏర్పాటుచేసుకుని వ్యాపారాలు చేసుకునే వారు.
  • తోపుడు బండ్లు లేదా తలమీద/భుజంమీద బుట్టలు/ గంపలలో వస్తువులు/ సరుకులను మోస్తూ అమ్ముకునే వారు మరియు వీధులలో సరుకులు/ వస్తువులు అమ్ముకునే వారు.
  • ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సైకిల్, మోటార్ వెహికల్ మరియు చక్రాల బండి మీద వెళ్తూ సరుకులు/ వస్తువులు అమ్ముకునేవారు.
  • 5X5 అడుగుల స్థలంలో కిరాణా షాపుల ద్వారా వస్తువులు, సరుకులు అమ్ముకునే వారు.
జగనన్న తోడుగా పథకానికి ఎవరు అర్హులు?
  • 18 సంవత్సరాలు నిండిన వారు
  • నెలవారీ ఆదాయం గ్రామాలలో రూ.10,000/- మరియు పట్టణాలలో రూ.12,000/- కలిగిన వారు
  • మాగాణి భూములు మూడు ఎకరాలు లేదా మెట్టభూములు 10ఎకరాలు లేదా మెట్ట మరియు మాగాణి భూములు కలిపి 10ఎకరాలు ఉన్నవారు
  • ప్రభుత్వం జారీచేసిన గుర్తింపు కార్డులను (అధార్ కార్డు, ఓటర్ కార్డు, లేదా ఇతరములు) కలిగినవారు
  • సుమారు 5x5 అడుగుల స్థలంఉన్న మరియు అంతకు తక్కువ ఉన్న షాపులలో వ్యపారం చేసుకుంటున్నవారు.
కార్యాచరణ మార్గదర్శకాలు:
సర్వే మరియు ఎంపిక విధానము
  • గ్రామ మరియు వార్డు వాలంటీర్లు వారిపరిధిలో ఉన్న చిరువ్యాపారులను సర్వే ద్వారా గుర్తించాలి.
  • సామాజిక తనిఖీ కొరకు గుర్తించిన చిరువ్యాపారుల జాబితాను గ్రామ/వార్డు సచివాలయంలో ప్రదర్శించాలి. సామాజిక తనిఖీ పూర్తయిన తరువాత తుది జాబితాను రూపొందించాలి.
  • నిరంతర సామాజిక తనిఖీ కొరకు మరియు పారదర్శకత కొరకు తుది జాబితాను సచివాలయంలో ప్రదర్శించాలి.
  • అర్హులు ఎవరైనా తన పేరు తుది జాబితాలో నమోదు కాలేదు అంటే అట్టి వారు
  • గ్రామ/వార్డు సచివాలయంలో పేరును నమోదు చేసుకోవలెను.
  • జగనన్న తోడుగా పధక అమలును నిరంతరం పర్యవేక్షించుటకు పారదర్శకమైన ఆన్లైన్ పోర్టల్ ను బ్యాంకుల సమన్వయంతో నిర్వహించబడుతుంది.
తుది జాబితా ద్వారా ఎంపిక చేసిన చిరువ్యాపారులు అందరికీ గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా QR కోడ్ కలిగిన స్మార్ట్-గుర్తింపు కార్డును అందించాలి.
బ్యాంకు ఎకౌంటు లేని వారికి గ్రామ/వార్డు వాలంటీర్లు దగ్గరలోని బ్యాంకులలో వ్యక్తిగత పొదుపు (SB) ఎకౌంటును ప్రారంభించాలి.

జగనన్న పధకం ద్వారా వడ్డీలేని ఆర్థిక సహాయం పొందు విధానం:
  • ఈ పధకంలో దరఖాస్తులను గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా గ్రామ/వార్డు సచివాలయాలలో స్వీకరిస్తారు. 
  • దరఖాస్తులను పూర్తిచేయుటలో మరియు అవసరమైన ఋజువర్తనాలు (డాకుమెంట్స్) జతపరచుటలో వార్డు వాలంటీర్లు చిరువ్యాపారులకు సహకరిస్తారు.
  • గ్రామ/వార్డు సచివాలయాల వద్ద సామాజిక తనిఖీ చేసిన జాబితాను జిల్లా కలెక్టర్ వారు పరిశీలించి మరియు ఆమోదించిన జాబితాను బ్యాంకులకు పంపబడును. 
  • బ్యాంకు సిబ్బంది దరఖాస్తులను పరిశీలించిన తరువాత మార్గదర్శకాల ప్రకారం పధకానికి అర్హులైన దరఖాస్తుదారుల అభ్యర్ధన మేరకు రూ.10,000/-లకు వరకు ఋణమును మంజూరు చేస్తారు. 
  • మంజూరు చేసిన ఋణమును లబ్ధిదారుల వ్యక్తిగత బ్యాంకు ఎకౌంటులకు ప్రత్యక్షంగా బదిలీ చేస్తారు. 
  • ఋణం పంపిణీ చేసిన జాబితా మరియు తిరిగి చెల్లింపు లావాదేవీలను రోజువారీ విధానంలో బ్యాంకువారు గ్రామ/వార్డు సచివాలయాలకు మరియు సంబంధిత వాలంటీర్ కు సమాచారం మరియు పర్యవేక్షణ నిమిత్తం పంపబడుతుంది. 
  • చిరువ్యాపారులు నెలవారీ ఋణం యొక్క అసలు మరియు వడ్డీ చెల్లింపులు బ్యాంకులకు సక్రమంగా చెల్లించేలా గ్రామ/వార్డు వాలంటీర్లు పర్యవేక్షించవలెను మరియు బ్యాంకు కలెక్షన్ ఏజెంట్లకు సహకరించవలెను. 
  • బ్యాంకులకు వడ్డీ చెల్లింపు విధానాన్ని బ్యాంకుల అనుసంధానంతో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ నిర్ధారిస్తుంది.
పధక అమలు సంస్థ: 
గ్రామ/వార్డు వాలంటీర్లు మరియు గ్రామ/వార్డు సచివాలయాల శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.