Work From Home New Survey 2025 in AP
ఇంటి వద్ద నుండే పని Work From Home ని Andhra Pradesh State లొ ఎవరైతే ITI, Diploma, Any Degree, Graduation, Post Graduation Or Higher Education Qualification చేసి ఉంటారో వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనగా ఒక జాబ్ కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసే సమయంలో ఏ ఏ వివరాలైతే అడుగుతాయో ఉదాహరణకు వ్యక్తిగత వివరాలు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, చదివిన వివరాలు సర్టిఫికెట్లు etc.. వంటి సమగ్ర సమాచారంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది AP GSWS Employees ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా Work From Home New Survey ను ప్రారంభించడం జరిగింది.
What About Old AP Work From Home Survey ?
గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా 18 సంవత్సరాలు నుండి 60 సంవత్సరాల లోపు వయసు కలిగి విద్య అర్హతతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సర్వేను చేయడం జరిగింది. ఆ సర్వే ద్వారా రాష్ట్ర నలుమూలలలో ఎక్కువగా వర్క్ ఫ్రొం హోమ్ కావాలనుకునే వారికి ఎక్కువగా ఎక్కడైతే ఉంటారో వారికి దగ్గరలో ప్రభుత్వం భవనాలలో గాని లేదా ప్రభుత్వం అద్దెకు తీసుకొని వర్క్ ఫ్రం హోం ను ప్రభుత్వం కల్పించాలని చూసింది.
ఈ సర్వేలో Grama Ward Sachivalayams గ్రామ లేదా వార్డు సచివాలయాలలో క్లస్టర్ల వారీగా ఆటోమేటిగ్గా పేర్లు వచ్చి ఉంటాయి. పేర్లు వచ్చిన వారికి మాత్రమే గ్రామ లేదా వార్డు సచివాలయ సిబ్బంది AP GSWS Emoloyees ఎవరైతే ఆయా క్లస్టర్లు టాగై Tag ఉంటారు వారు సర్వేను చేస్తారు. పేరు లేని వారు ఈ సర్వేలో పాలు పంచుకోవడానికి అవకాశం అయితే ప్రస్తుతానికి లేదు. అటువంటి వారికి ప్రభుత్వం అవకాశం కల్పించిన తర్వాత తెలియజేయడం జరుగును.
ఈ సర్వేను గ్రామ లేదా వార్డు సచివాలయ సిబ్బంది వారు రోజు ఉపయోగించే అనే GSWS Employees App మొబైల్ యాప్ లో చేయాల్సి ఉంటుంది. కొత్తగా అప్డేట్ అయిన మొబైల్ యాప్ ను సిబ్బంది డౌన్లోడ్ చేసుకోగలరు. ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసిన వెంటనే ఆప్షన్ మీకు కనిపించకపోవచ్చు అప్పుడు లాగౌట్ అయ్యి మరల లాగిన్ అయినట్టు అయితే సర్వే ఆప్షన్ మీకు కనిపిస్తుంది.
ముందుగా మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని
లాగ్ అవుట్ అయి User ID ఎంటర్ చేసి లాగిన్ అయినట్టు అయితే కింద చూపించినట్టుగా ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Search by Cluster / Search by UID అని రెండు ఆప్షన్లు చూపిస్తుంది. సిబ్బంది వారి క్లస్టర్ లోకి వెళ్లిన తర్వాత ఎవరైనా సరే వారి ఆధార నెంబర్ చూపించి నాకు సర్వే చేయండి లేదా నా పేరు వచ్చిందా లేదా చూడండి అని అడిగినట్లయితే నేరుగా search by UID లొ వారి ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి పేరు వచ్చిందా రాలేదా వస్తే సర్వేను ప్రారంభించవచ్చు. లేదా వారికి కేటాయించిన క్లస్టర్లో సర్వేను ప్రారంభించాలనుకుంటే మొదట ఆప్షన్పై టిక్ చేసి క్లస్టర్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
కానీ అందులో 18 నుండి 60 సంవత్సరాల లోపు వారు విద్యార్హతలు లేకుండా చాలామంది ఉన్నందున ఆ ప్రక్రియ ఆగిపోయింది. మరలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు ఒకటి 2025 నుండి ఎవరైతే విద్య అర్హత కలిగి ఉంటారో ప్రభుత్వ రికార్డుల మేరకు వారికి మాత్రమే సర్వే చేయాలని ఉద్దేశంతో కొత్తగా Work From Home New Survey సర్వేను ప్రారంభించింది.
ఈ సర్వేలో Grama Ward Sachivalayams గ్రామ లేదా వార్డు సచివాలయాలలో క్లస్టర్ల వారీగా ఆటోమేటిగ్గా పేర్లు వచ్చి ఉంటాయి. పేర్లు వచ్చిన వారికి మాత్రమే గ్రామ లేదా వార్డు సచివాలయ సిబ్బంది AP GSWS Emoloyees ఎవరైతే ఆయా క్లస్టర్లు టాగై Tag ఉంటారు వారు సర్వేను చేస్తారు. పేరు లేని వారు ఈ సర్వేలో పాలు పంచుకోవడానికి అవకాశం అయితే ప్రస్తుతానికి లేదు. అటువంటి వారికి ప్రభుత్వం అవకాశం కల్పించిన తర్వాత తెలియజేయడం జరుగును.
Requirements For AP Work From Home New Survey 2025
ఈ సర్వేలో పాలుపంచుకోవాలంటే సర్వేలో పేరు వచ్చినవారు కింద తెలిపిన వివరాలను మీ వద్ద సిద్ధంగా ఉంచుకోవాలి. అదేవిధంగా సర్వే చేస్తున్న AP GSWS Employees సిబ్బంది వారికి కేటాయించిన క్లస్టర్లలో ఈ సర్వే చేయాలి అంటే ఆయా వ్యక్తులకు సంబంధించి కింద తెలిపిన వివరాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని తెలియజేయాలి.- సర్వే ప్రారంభానికి ఆ వ్యక్తి యొక్క OTP / Face / Biometric
- మొబైల్ నెంబర్ OTP
- మెయిల్ ఐడి కు OTP
- వారు ఏం చదువుకున్నారో దానికి సంబంధించిన సర్టిఫికెట్
- చదివిన సంవత్సరం,
- పర్సంటేజ్
- ఏం చదివారు
- ఎక్కడ చదివారు
Work From Home New Survey 2025 in AP Process
ముందుగా మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని
లాగ్ అవుట్ అయి User ID ఎంటర్ చేసి లాగిన్ అయినట్టు అయితే కింద చూపించినట్టుగా ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Search by Cluster / Search by UID అని రెండు ఆప్షన్లు చూపిస్తుంది. సిబ్బంది వారి క్లస్టర్ లోకి వెళ్లిన తర్వాత ఎవరైనా సరే వారి ఆధార నెంబర్ చూపించి నాకు సర్వే చేయండి లేదా నా పేరు వచ్చిందా లేదా చూడండి అని అడిగినట్లయితే నేరుగా search by UID లొ వారి ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి పేరు వచ్చిందా రాలేదా వస్తే సర్వేను ప్రారంభించవచ్చు. లేదా వారికి కేటాయించిన క్లస్టర్లో సర్వేను ప్రారంభించాలనుకుంటే మొదట ఆప్షన్పై టిక్ చేసి క్లస్టర్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఎవరికైతే సర్వే చేయాలో వారి పేరుపై క్లిక్ చేసిన Face / Irish / Biometric / OTP అనే ఆప్షన్లు చూపిస్తాయి అందులో ఒక ఆప్షన్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది వ్యక్తి అందుబాటులో ఉండే మొబైల్ కు స్కానర్ కనెక్ట్ చేసి ఉన్నట్టయితే బయోమెట్రిక్ ద్వారా లేదా వెలుతురు కావలసినంత ఉండి ఫేస్ ద్వారా లేదా మొబైల్ కి ఓటిపి చెప్పే పరిస్థితిలో ఉంటే ఓటీపీ సెలెక్ట్ చేసి ఆ వ్యక్తికి సర్వే ప్రారంభించాల్సి ఉంటుంది.
వెంటనే కింద చూపించినట్టుగా పూర్తి పేరు పుట్టిన తేదీ లింగము సొంత రాష్ట్ర సొంత జిల్లా వివరాలు చూపిస్తాయి. ఫోన్ నెంబర్ వద్ద ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేయాల్సి ఉంటుంది అంటే ఆ మొబైల్ కు ఓటిపి వస్తుంది ఓటిపి ఎంటర్ చేయాలి.

తరువాత ఈమెయిల్ ఐడి ఎవరైతే సర్వే చేస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి వెరిఫై చేసినట్లయితే ఈమెయిల్ ఐడి కు ఓటిపి వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి ధృవీకరించాల్సి ఉంటుంది.
చివరగా సబ్మిట్ చేసినట్టయితే ఆ వ్యక్తికి ఈ సర్వే అనేది పూర్తి అవుతుంది.
AP Work Form Home Survey New Questionaries in Telugu
తర్వాత కింద ప్రశ్నలు అడుగుతాయి.- తెలిసిన భాషలు ఎన్ని అవి ఏంటి
- విద్య అర్హత ఏంటి
- విద్యా అర్హతలు స్పెషలైజేషన్ ఏమిటి
- వచ్చిన మార్కులు లేదా జిపిఏ ఎంత
- ఏ సంవత్సరం పాస్ అయ్యారు
- పాస్ అయినట్టు ఒరిజినల్ డాక్యుమెంట్ ఫోటో అప్లోడ్ చేయాలి. బయట ఉంటే ఫోటో తీసి అప్లోడ్ చేయొచ్చు లేదా ఫోన్లో ఉన్నట్లయితే అప్లోడ్ చేసి అప్లోడ్ చేయొచ్చు.
- ఎక్కడ చదువుకున్నారు లొకేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
- ఇతర క్వాలిఫికేషన్ అంటే విద్యార్హతలు ఉంటే వాటిని కూడా నమోదు చేయవచ్చు. అప్పుడు మరల పైన వివరాలన్నీ కూడా అడుగుతాయి.
- అప్లోడ్ చేసిన సర్టిఫికెట్ యొక్క వివరాలను కూడా అవసరమైతే ఎంటర్ చేయవచ్చు అవసరం లేకపోతే అవసరం లేదు.
చివరగా సబ్మిట్ చేసినట్టయితే ఆ వ్యక్తికి ఈ సర్వే అనేది పూర్తి అవుతుంది.
Report Of Work From Home New Survey 2025 in AP
సర్వేకు సంబంధించి జిల్లాల వారీగా మండలాల వారీగా సచివాలయాల వారీగా సచివాలయంలోని క్లస్టర్ల వారీగా రిపోర్టు తెలుసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కింద ఇవ్వబడిన లింకు ఓపెన్ చేసినట్టయితే ప్రభుత్వ అధికారిక వెబ్సైట్కు తీసుకొని వెళ్ళటం జరుగుతుంది అక్కడ మీ జిల్లా మీ మండలం మీ సచివాలయాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే రిపోర్టు తెలుస్తుంది. చివరి మాట ఏంటంటే అడిగిన ప్రశ్నలు బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంట్రా అంటే ప్రభుత్వం ఈ సర్వే ను చాలా సీరియస్గా తీసుకుంటుంది ఎవరైతే వివరాలు సరిగా అప్లోడ్ చేస్తారో ఎవరి వివరాలైతే సరిగా ఉంటాయో వారికి ప్రభుత్వం నేరుగా వర్క్ ఫ్రం హోం సంబంధించి అవకాశాన్ని కల్పించే అవకాశం ఉంది.కాబట్టి సర్వే చేస్తున్నవారు మరియు చేయించుకుంటున్న వారు ఇద్దరు కూడా జాగ్రత్తపడి దగ్గరగా ఉండి ఈ యొక్క సర్వేను చేయించుకున్నట్లయితే భవిష్యత్తులో ప్రభుత్వం కల్పించే కల్పించబోయే ఏదైనా వర్క్ ఫ్రం హోం సంబంధించి ఇంటి వద్ద నుండే మీరు పని చేసుకునే విషయంలో ప్రభుత్వం ఏదైనా అవకాశం కల్పిస్తే మీరు అందులో భాగస్వాములు అయి మీ ఇంటికి జీవనోపాధిగా నిలిచే అవకాశం ఉంటుంది.
ఈ సమాచారాన్ని మీరు చదవడం కాకుండా మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి నేరుగా ఈ పేజీ యొక్క లింక్ కాపీ చేసుకుని మీకు తెలిసిన వాట్సాప్ గ్రూప్లో టెలిగ్రామ్ గ్రూపులో ఇతర ఇతర గ్రూపులలో షేర్ చేసినట్లయితే మాతోపాటు మీకు తెలిసిన వారికి కూడా సహాయం చేసిన వాళ్ళు అవుతారు.